
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది "హరి హర వీరమల్లు" అనే చెప్పాలి. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ సినిమా రిలీజ్ కి నోచుకోవడంలేదు. ఈ సినిమా తరువాత స్టార్ట్ అయిన వకీల్ సాబ్, భీమ్ళా నాయక్ సినిమాలు పూర్తై రిలీజ్ కూడా అయ్యాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. "హరి హర వీరమల్లు" మూవీని పక్కన పెట్టేసి మరో మూడు సినిమాలను లైన్లో పెట్టేశాడు పవన్. వాటిల్లో ఒకటి పూర్తయింది కూడా. ఇంకో రెండు గ్యాప్ లేకుండా షూటింగ్ లు జరుపుకుంటున్నాయి.
కానీ హరి హర పరిస్థితి మాత్రం మారలేదు. కారణం తెలియదు కానీ ఎందుకో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. అయితే.. ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి చాలా మార్పులు చేసారని, పాటలు కూడా చేంజ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో.. పవన్ ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల తరువాతే హరి హర వీరమల్లు ఉంటుదనేది మాత్రం పక్క. ఈ సినిమాలి కాంప్లెట్ అయ్యి రిలీజ్ అవడానికి కనీసం ఒక సంవత్సరమైన పడుతుంది. కాబట్టి ఈ సినిమా కోసం మేకర్స్ తో పాటు.. ఫాన్స్ కూడా వన్ ఇయర్ ఆగాల్సిందే.
అయితే.. ఈ పరిస్థితుల్లో డైరెక్టర్ క్రిష్ ఒక నిర్ణయానికి వచ్చాడట. అదేంటంటే.. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు చేసిన షూటింగ్ కి మరో రెండువారాలు షూట్ చేస్తే కథ ఓ కొలిక్కి వస్తుందట. అప్పుడు దీన్ని ఫార్ట్ వన్ గా రిలీజ్ చేసి మిగతా కథని పార్ట్2 గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పుడు దీని మీదే మేకర్స్ మధ్య డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ కనుక ఓకె అంటే ఈ దిశగా ముందుకు వెళ్లే అవకాశం వుంది. ఈ విషయంపై పవన్ ని సంప్రదించి, ఆయన అప్పుకున్నాక అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట మేకర్స్. మరి ఈ ప్రపోజల్ కి పవన్ ఎలా రియాక్ట్ అయ్యడనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.