వీర విక్రమ

వీర విక్రమ

పాతికేళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎప్పుడూ హిస్టారికల్ సబ్జెక్ట్స్ టచ్ చేయలేదు పవన్ కళ్యాణ్. ఈ జానర్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ టైమ్‌‌‌‌ ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారాయన. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో భారీ సెట్టింగ్స్‌ లో షూటింగ్ జరుగుతోంది. శ్రీరామ నవమి పండుగ రోజున కూడా షూటింగ్‌‌‌‌లో పాల్గొన్నారు పవన్. ఆయనతో పాటు టీమ్‌‌‌‌ అంతా సెట్‌‌‌‌లోనే పూజ నిర్వహించి, నవమి పండుగను జరుపుకున్నారు. పండుగ విషెస్‌‌‌‌ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతిలో బల్లెం, పదునైన చూపులతో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించారు పవన్. ఇక ఇటీవల పవన్ ఫైట్ రిహార్సల్స్‌‌‌‌కు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసిన టీమ్, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పవన్ మరోసారి తన మార్క్ మార్షల్ ఆర్ట్స్‌‌‌‌తో మెప్పించబోతున్నట్టు ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఏఎం రత్నం భారీ బడ్జెట్‌‌‌‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.