
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' (OG) సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్, అంచనాలను మించి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ట్రైలర్ ప్లే చేశారు. కొన్ని కారణాల వల్ల బయటకు మాత్రం రిలీజ్ చేయలేదు. ఇప్పుడు వర్క్ పూర్తవడంతో ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేశారు.
యాక్షన్, స్టైల్, డైలాగ్స్.. అన్నీ పక్కా!
'ఓజీ' అంటే 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనే విషయం ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో తుపాకీతో పోరాటాలు చేయడం, పవర్ఫుల్ డైలాగులు పలకడం అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్ సీన్లు హాలీవుడ్ స్థాయిని తలపించాయి. ప్రత్యేకించి, ట్రైలర్ మధ్యలో "నువ్వు పడితే ఎలా ఉంటుంద్రా" అని పవన్ చెప్పే డైలాగ్, ఆ తర్వాత వచ్చే భారీ యాక్షన్ సీన్ గూస్‌బంప్స్ తెప్పించింది.
ట్రైలర్ కు ప్రాణం పోసిన థమన్..
యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కనిపించగా, ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ట్రైలర్‌కు ప్రాణం పోసింది థమన్ అందించిన నేపథ్య సంగీతం. సినిమా కథ, యాక్షన్ సీన్లకు తగ్గట్టుగా బీజీఎం అద్భుతంగా కుదిరింది. గతంలో 'భీమ్లా నాయక్'తో పవన్ కల్యాణ్ అభిమానులను అలరించిన థమన్, ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని ఆశిస్తున్నారు.
ALSO READ : ప్రభాస్ చేతుల మీదుగా 'కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్!
ఇక నటీనటుల విషయానికి వస్తే, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన ప్రెజెన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. ప్రకాశ్ రాజ్ మరో కీలక పాత్రలో నటించగా, ఆయన అనుభవం, నటన సినిమాకు బలం చేకూర్చేలా ఉన్నాయి. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటించగా, ఆమెతో పవన్ కల్యాణ్ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలాగే, నటి శ్రియా రెడ్డి ఒక పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.
మొత్తంగా, 'ఓజీ' ట్రైలర్ చూస్తుంటే.. అభిమానులకు కావాల్సిన యాక్షన్, స్టైల్, డైలాగ్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయని స్పష్టమైంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఒక గొప్ప పండగ లాంటిదని చెప్పవచ్చు. విడుదలైన మొదటి రోజే సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా, పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.