ఉస్తాద్ వెనక్కి.. రైడ్ ముందుకి.. ఇంతకీ హరీష్ ప్లాన్ ఏంటి?

ఉస్తాద్ వెనక్కి.. రైడ్ ముందుకి.. ఇంతకీ హరీష్ ప్లాన్ ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) కాంబోలో ఉస్తాగ్ భగత్ సింగ్(Ustaad bhagathsingh) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్(Gabbar singh) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. ఉస్తాగ్ భగత్ సింగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. 

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అదేంటంటే.. ఉస్తాగ్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ను ప్రస్తుతానికి ఆపేశారట మేకర్స్. దానికి కారణం పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలో ఉండటమే. ఓపక్క పొలిటికల్ మీటింగ్స్, మరోపక్క సినిమా షూటింగ్స్ కి టైం సరిపోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కానుందట.

దీంతో మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారట దర్శకుడు హరీష్ శంకర్. ఇందుకోసం మరోసారి మాస్ మహారాజ్ రవితేజ(Massmaharaj raviteja)తో జతకట్టనున్నాడట. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన రైడ్(Raid) సినిమాను తెలుగులో రవితేజతో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట హరీష్. ఈ కథకు రవితేజ కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఇక త్వరలొనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. ఇక ఉస్తాగ్ భగత్ సింగ్  విషయానికి వస్తే.. ఏపీలో ఎలక్షన్స్ ముగిశాకే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.