
అధికారంలో ఉన్న చంద్రబాబు అవినీతిపై పవన్ ఏం మాట్లాడరని… కేవలం తనను మాత్రమే తిడతాడని అన్నారు YCP పార్టీ జగన్మోహన్‌రెడ్డి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. ఇలాంటి కుట్రలు ఇంకా చాలా జరుగుతాయన్నారు. చంద్రబాబు ఏం చెబితే అది పవన్ చేస్తున్నారన్నారు. డైరెక్టర్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ యాక్టర్ పవన్ చదువుతున్నారన్నారు. జగన్‌కు కష్టం వస్తే ముందుగా సంతోషించేది చంద్రబాబేనన్నారు. మా చిన్నాన్న హత్య జరిగితే చంద్రబాబు పండగ చేసుకున్నారన్నారు. వైఎస్ వివేకా హత్యపై పవన్ కూడా అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. మా కుటుంబ సభ్యులపై మాట్లాడుతున్న మాటలు చూస్తే బాధగా ఉందన్నారు. ఓటు కోసం ఒక్కొక్కరికి రూ.3వేలు పంచుతున్నారని, చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దన్నారు. 20 రోజులు ఓపికపడితే జగన్ సీఎం అవుతారని అందరికి చెప్పాలన్నారు. రుణాలు మాఫీ జరగలేదని ప్రతి ఒక్కరికీ చెప్పాలన్నారు.
పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ.15వేలు ఇస్తానన్నారు వైఎస్ జగన్. ఎన్ని లక్షలు ఖర్చయినా మీ పిల్లలను చదివించే బాధ్యత తనదేనన్నారు. పొదుపు సంఘాల్లోని రుణాలను మాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. YS హయాంలోనే సున్నా వడ్డీ రుణాలు వచ్చేవన్నారు. ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల్లోని రుణాలు మాఫీ చేస్తానన్నారు హామీ ఇచ్చారు. సున్నా వడ్డీ రుణాలు మళ్లీ వైఎస్ తర్వాత తానే ఇస్తానన్నారు. 45 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసున్న మహిళలకు వైఎస్‌ఆర్ చేయూత కింద రూ.75వేలు, మే నెలలో పెట్టుబడి కింద రూ.12,500 ఇస్తానన్నారు. గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఉంటానన్నారు వైఎస్ జగన్.