నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో పాయల్ రాజ్ పుత్

నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో పాయల్ రాజ్ పుత్

పాయల్ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్‌‌‌‌‌‌‌‌ పేరు వినగానే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ 100, మంగళవారం లాంటి చిత్రాల్లోని బోల్డ్ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి.  ఓ వైపు గ్లామర్, మరోవైపు తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాయల్.. గత ఏడాది రక్షణ, గోల్‌‌‌‌‌‌‌‌మాల్, ఏంజెల్, కిరాతక చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె మరో డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతోంది.  సినిమా టికెట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్ అండ్ అర్జున్ ఆర్ట్స్ సంస్థలు పాయల్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మించబోతున్నాయి. ముని దర్శకుడు.

ఈనెల 24న రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో సినిమా ప్రారంభం కానుంది.  ఇందులో పాయల్ క్యారెక్టర్ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ ఉండబోతోందని, నెవర్ బిఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌తో ఆమె సర్‌‌‌‌ప్రైజ్ చేయబోతోందని మేకర్స్ చెబుతున్నారు.  ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పాయల్‌‌ కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందేమో చూడాలి!