పాయల్ రాజ్‌పుత్ కు ఆ సూపర్ స్టార్ అంటే ఇష్టమట..

పాయల్ రాజ్‌పుత్ కు ఆ సూపర్ స్టార్ అంటే ఇష్టమట..

‘ఆర్‌ఎక్స్‌ 100’(RX100) మూవీతో బాగా పాపులర్ అయినా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). వరుస సినిమాలతో బిజీగా ఉన్న సరైన హిట్ లేకపోవడంతో కథల ఎంపికపై ఓ ఇంటర్వ్యూ లో స్పందించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్‌ తెలుగులో తనకు తొలి అవకాశం ఇచ్చిన అజయ్‌ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో ‘మంగళవారం’(Mangalavaram) లో మూవీలో నటిస్తోంది. 

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట చెప్పేసేంది. ' మహేష్ బాబు(Mahesh Babu)  అంటే తనకి ఎంత ఇష్టమో వివరిస్తూ  ‘‘నాకు ‘సర్కారువారి పాట’లో అవకాశం వస్తే బాగుండనుకున్నాను. కీర్తిసురేశ్‌ ఆ సినిమాలో అద్భుతంగా నటించింది. మహేశ్‌ బాబు సరసన నటించాలనేది  నా కోరిక’’ అంటూ అభిప్రాయం తెలిపింది. త్వరలో మహేష్ తో యాక్ట్ చేసే అవకాశం వస్తుందేమో చూడాలి. 

పాయల్ ‘మంగళవారం మూవీ ”గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో.. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా కథనంతో మూవీ ఉంటుందని సమాచారం. 

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది. గతంలో వెంకీ మామ మూవీలో హీరో వెంకటేష్(Venkatesh) తో నటించినప్పటికీ పాయల్ కు సరైన హిట్ పడలేదు. అందుకు కొంత మంది తనను మిస్ గైడ్ చేయడమే కారణం అంటూ ఇంటర్వ్యూలో తెలిపింది.