
ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇటీవల మాయా పేటిక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాయల్‌తో పాటు బేబీ మూవీ ఫేం విరాజ్ లీడ్ రోల్లో నటించాడు. ఈ మూవీకి థియేటర్ ఆడియెన్స్ నుంచి ఊహించిన రెస్పాన్స్ రాలేదు. కానీ, ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ నెల 15 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది.
లేటెస్ట్ గా మాయాపేటిక సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసింది. అదికూడా కేవలం నాలుగురోజుల్లోనే ఈ రికార్డు సాధించడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆహా టీం పంచుకుంది. దీంతో ఎట్టకేలకు పాయల్ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
ఆరు కథలతో ఆంథాలజీగా డైరెక్టర్ రమేష్ రాపర్తి ఈ సినిమాను తెరకెక్కించాడు .సెల్‌ఫోన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే..ప్రస్తుత జనరేషన్ లో సెల్‌ఫోన్ ప్రేమికుల్ని విడదీయగలదు...కలపగలదు. అవసరమైతే ప్రాణాలను తీసే మానవ బాంబుగా కూడా మారే శక్తి సెల్‌ఫోన్‌కు ఉందని డైరెక్టర్ రమేష్ చక్కగా చూపించారు.
పాయల్‌కు కెరీర్ మొదట్లో వరుసగా ఆఫర్స్ వచ్చాయి..అయితే ప్రస్తుతం మాత్రం పెద్దగా సినిమాలు ఏవి లేవు. దీనికి కారణం నటన కంటే కూడా అందాల ఆరబోతపై ఎక్కువుగా ఫోకస్ పెట్టడమే అని అంటున్నారు సినీ క్రిటిక్స్.
వెంకీ మామ, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, జిన్నా వంటి సినిమాలు పాయల్‌కు సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి. దాంతో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అజయ్‌భూపతి మంగళవారంలో నటిస్తోంది.
? Heat ekkipothundi..!
— ahavideoin (@ahavideoIN) September 19, 2023
25 Million streaming minutes ante anthega mari..?
Watch 'Maya petika' on aha▶️ https://t.co/9QC0f3VuuG pic.twitter.com/3dqGP5NNHa