
ఆర్‌ఎక్స్ 100, మంగళవారం లాంటి చిత్రాల్లో బోల్డ్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్.. ఈసారి ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రక్షణ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది పాయల్. పోలీస్ గెటప్‌లో ఇంటెన్స్ లుక్‌లో పాయల్ కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ పాయల్ చేసిన సినిమాలకు భిన్నంగా, ఆమెను సరికొత్త కోణంలో చూపించే సినిమా ఇది. ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అన్నారు.