
ఆర్ఎక్స్ 100(RX 100) బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(payal rajput) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తనకు ఇప్పటివరకూ మరో సక్సెస్ రాకపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘మొదటి సినిమా తర్వాత నేను ఒంటరిగానే హైదరాబాద్‌లో ఉండాల్సివచ్చింది. ఆ సమయంలో కొందరు దర్శకులు నన్ను తప్పుదోవ పట్టించే సలహాలు ఇచ్చారు. నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు సినిమాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. నచ్చిన సినిమాలకే సంతకం చేస్తాను. నెగిటివిటీని పక్కన పెట్టి ముందుకు సాగుతున్నా’ అని పాయల్ తెలిపింది.
వెంకటేశ్(Venkatesh) గురించి మాట్లాడుతూ ఆయన చాలా మంచి వ్యక్తి అని.. అవకాశం వస్తే మరోసారి కలిసి నటిస్తానని తెలిపింది. రవితేజ(Raviteja), వెంకటేశ్ సరసన ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అజయ్ భూపతి(Ajay Bhoopathi) దర్శకత్వంలో ‘మంగళవారం(Mangalavaaram)’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.