
పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal rajputh) ఇటీవల తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి షాకిచ్చింది. పాయల్ కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ కంగారుపడ్డారు. తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించింది. తనకు నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉండేదని దాని వల్లే కిడ్నీ సమస్యల బారిన పడ్డట్టు తెలిపింది. అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అందరూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాని సూచించింది.
తన మొదటి ప్రేమ గురించి చెప్తూ తాను స్కూల్ డేస్‌లోనే ఓ అబ్బాయిని ఇష్టపడ్డానని తెలిపింది. తన ప్రపోజల్‌ను రిజెక్ట్ చేయడంతో తన హైస్కూల్ చదువు డిస్టర్బ్ అయ్యిందని ఆ టైంలో తన తల్లి వల్లే తిరిగి నార్మల్ అయినట్టు పాయల్ వివరించింది. ఈ హీరోయిన్ నటించిన ‘మంగళవారం’ ఈ నెల 17న రిలీజ్ కానుంది.