వెంకటలచ్చిమి గెటప్ లో ఆదివాసీ మహిళగా.. పాయల్ రాజ్ పుత్..

వెంకటలచ్చిమి గెటప్ లో ఆదివాసీ మహిళగా.. పాయల్ రాజ్ పుత్..

ఆర్‌‌ఎక్స్‌‌ 100, మంగళవారం వంటి సినిమాలతో యూత్ ఆడియెన్స్‌‌ను ఇంప్రెస్ చేసిన  పాయల్‌‌ రాజ్‌‌పుత్ ఈ సారి  ‘వెంకటలచ్చిమి’ గెట‌‌ప్‌‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ముని దర్శకత్వం వహిస్తుండగా.. రాజా, పవన్ బండ్రేడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం పాయల్ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌‌డే విషెస్ తెలియజేస్తూ ఆమె  స్పెషల్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఒక  జైలు గదిలో పైకప్పుకు తలక్రిందులుగా వ్రేలాడితీసి చేతికి సంకెళ్లు, మెడలో మంగళసూత్రం ఉన్న పాయల్ పోస్టర్ ఎంతో ఇంటెన్స్‌‌గా ఉంది. 

చుట్టూ  రక్తపు మరకలతో ఉన్న ఈ  పోస్టర్‌‌ చూస్తుంటే   సినిమా ఎంత థ్రిల్లింగ్‌‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. ఆదివాసీ మహిళ ప్రతీకార కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయని దర్శకుడు ముని చెప్పాడు.  త్వరలోనే ఫస్ట్ లుక్, గ్లింప్స్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు, పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు  నిర్మాతలు  తెలియజేశారు.  వికాస్‌‌ బడిశా సంగీతం అందిస్తున్నాడు.