స్మార్ట్‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా చెల్లింపులు.. అమెజాన్ పే యూపీఐ సర్కిల్ప్రారంభం

స్మార్ట్‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా చెల్లింపులు.. అమెజాన్ పే యూపీఐ సర్కిల్ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ పే తన యూపీఐ సర్కిల్​పేరుతో కొత్త ఫీచర్​ను ప్రారంభించింది. దీనితో యూపీఐ ఖాతాదారులు వారి నమ్మకస్తులకు సులువుగా డబ్బులు పంపవచ్చు. ప్రైమరీ యూజర్​ తన కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులను ఈ "సర్కిల్"​లో చేర్చుతారు. ఇందులోని వారికి ప్రత్యేక యూపీఐ ఐడీ లేదా క్యూఆర్​ కోడ్ వస్తుంది.  

ముందుగా నిర్ణయించిన ఖర్చు పరిమితులతో యూపీఐతో డబ్బు చెల్లించవచ్చు. సర్కిల్​ మెంబర్లకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం లేదు. భద్రత కోసం పిన్ అవసరం లేదు. బయోమెట్రిక్ అథెంటికేషన్ సరిపోతుంది. 

స్మార్ట్‌‌‌‌‌‌‌‌వాచ్​ వంటి వేరబుల్స్​ ద్వారా యూపీఐ యాప్స్​ను వాడవచ్చు.  ట్యాప్ -అండ్ -గో పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌‌‌‌‌‌‌‌తో ‘సర్కిల్​’లో ఉన్న వారికి షాపింగ్ రివార్డ్‌‌‌‌‌‌‌‌లు, క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్​లు వస్తాయని అమెజాన్​పే తెలిపింది.