పేటీఎం కంపెనీలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత!

పేటీఎం కంపెనీలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత!

పేటీఎం కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఖర్చులతో పాటు, ఉద్యోగుల ఖర్చులను భారీగా తగ్గించుకునేందుకు చూస్తోంది. అందుకోసం కంపెనీ 15-20 శాతం ఉద్యోగులను తగ్గించుకోవచ్చని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. పెరుగుతున్న నష్టాలను నిర్వహించడానికి పేటీఎం సుమారు 5,000 నుంచి 6,300 మందిని తొలగించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులకు తగ్గించడం ద్వారా రూ. 400-500 కోట్లను ఆదా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన లావాదేవీలపై RBI విధించిన నిషేధంతో 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.550 కోట్ల నష్టం వచ్చిందని ఆ కంపెనీ పేర్కొంది.

ఫైనాషలియర్ 23లో కంపెనీ సగటున 32,798 మంది ఉద్యోగులను పేరోల్‌లో కలిగి ఉంది. అందులో 29,503 మంది యాక్టివ్‌ గా పని చేస్తున్నారు. ఒక ఉద్యోగికి సగటు జీతం రూ.7.87 లక్షలు. FY24 కోసం మొత్తం ఉద్యోగి ఖర్చులు సంవత్సరానికి 34 శాతం పెరిగి రూ. 3,124 కోట్లకు చేరాయి. ఒక్కో ఉద్యోగి సగటు ఖర్చు రూ. 10.6 లక్షలకు పెరిగింది. ఇప్పటికే డిసెంబర్‌లో 1,000 మంది ఉద్యోగులను తొలగించారు. FY24లో తొలగించే ఉద్యోగుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు. ఇది 20శాతంగా ఉండొచ్చని ప్రముఖ బిజినెస్ అనాలసిస్ట్స్ అంటున్నారు.