పేటీఎంలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా

పేటీఎంలో పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల వాటా

 న్యూఢిల్లీ : పేటీఎంలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 12.85 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌‌ క్వార్టర్‌‌లో  ఇది 8.28 శాతంగా ఉంది. అలానే డొమెస్టిక్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (డీఐఐ) వాటా కూడా డిసెంబర్ 31 నాటికి 4.06 శాతం నుంచి 6.06 శాతానికి పెరిగింది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పేటీఎంలో భారీగా ఇన్వెస్ట్ చేయడమే కారణం. తాజా షేర్‌‌‌‌హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం, మీరే మ్యూచవల్ ఫండ్‌‌,  నిప్పాన్‌‌ ఇండియా మ్యూచువల్ ఫండ్‌‌ పేటీఎంలో తమ వాటాలను 2.20 శాతం చొప్పున పెంచుకున్నాయి. 

ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌‌మెంట్ ఫండ్స్ దగ్గర 0.63 శాతం వాటా, ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర 0.40 శాతం వాటా, ప్రావిడెంట్ ఫండ్‌‌ లేదా పెన్షన్‌‌ ఫండ్స్ చేతిలో 0.50 శాతం వాటా ఉంది. ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు  పేటీఎంలో తమ వాటాను 0.49 శాతం నుంచి 0.67 శాతానికి పెంచుకున్నారు. ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల  వాటా 2.8 శాతం పెరిగి 63.72 శాతానికి చేరుకుంది.