పేటీఎంకు రూ.5.49 కోట్ల జరిమానా

పేటీఎంకు రూ.5.49 కోట్ల జరిమానా
  • మనీలాండరింగే కారణం

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌‌‌‌కు పాల్పడిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌పై భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ.5.49 కోట్ల జరిమానా విధించింది.  అక్రమ వ్యాపారాలు చేసే సంస్థల డబ్బు పేటీఎం ఖాతాల ద్వారా దారి మళ్లిస్తున్నారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి దర్యాప్తు సంస్థల ద్వారా సమాచారం అందుకున్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విచారణ జరిపింది. ఈ సంస్థలు ఎక్కువగా ఆన్​లైన్​ గ్యాంబ్లింగ్​ చేస్తున్నట్టు గుర్తించింది. 

జనవరి 31న, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 29లోపు   బ్యాంకింగ్ సేవలను నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్​బ్యాంకును కోరింది. ఆ తర్వాత గడువును మార్చి 15 వరకు పొడిగించింది. పేటీఎం దాని బ్యాంకింగ్ అనుబంధ సంస్థతో వ్యాపార సంబంధాలను తగ్గించుకుంటున్నట్లు చెప్పిన తర్వాత ఇలా జరిగింది.   పేటీఎం,  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రెండూ బిలియనీర్ విజయ్ శేఖర్ శర్మ  ఫిన్‌‌‌‌టెక్​ కంపెనీలు.