
న్యూఢిల్లీ : పేటీఎంను నిర్వహించే వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం దాదాపు 9 శాతం పడిపోయాయి. అమ్మకాల ఒత్తిడే ఇందుకు కారణం. బీఎస్ఈలో షేరు 8.67 శాతం తగ్గి రూ. 408.30కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 8.20 శాతం పతనమై రూ.410కి చేరాయి. వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గురువారం లోయర్ సర్క్యూట్‌ను తాకడంతో 10 శాతం పడిపోయాయి. మూడు రోజుల పతనం తర్వాత మంగళవారం 3 శాతానికి పైగా పుంజుకుంది.
కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించడంతో కంపెనీ స్టాక్ మూడు రోజుల్లో 42 శాతానికి పైగా పడిపోయింది. మార్కెట్ విలువ రూ. 20,471.25 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. పేటీఎం చాలా సార్లు రూల్స్‌ను ఉల్లంఘించడంతో చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ తెలిపింది. ఫిబ్రవరి 29 తరువాత కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని ఆపేయడంతోపాటు వాలెట్, డిపాజిట్, ప్రీప్రెయిడ్సేవలు అందించకూడదని స్పష్టం చేసింది.