Paytm కు పది రోజుల్లో 26 వేల కోట్ల నష్టం

Paytm కు పది రోజుల్లో 26 వేల కోట్ల నష్టం

RBI నిషేధం ప్రకటించినప్పటి నుంచి గడిచిన 10 ట్రేడింగ్ రోజుల్లో Paytm కంపెనీ స్టాక్ దాని విలువలో దాదాపు 55శాతం నష్ట పోయింది. దీంతో మార్కెట్ క్యాపిట లైజేషన్ నష్టం రూ. 26వేల కోట్లకు చేరింది. ఫిబ్రవరి 14 ప్రారంభంలో Paytm షేర్లు 9 శాతం పడిపోయి రూ. 350 కంటే దిగువకు చేరాయి. 

పేటీఎం మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు  27 నెలల్లో దాని విలువలో 80 శాతం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ లో రూ. 1.17 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. ఈ స్టాక్ ఇప్పుడు దాని IPO ధర రూ. 2,150 నుంచి 84 శాతం పడిపోయింది. 

KYC ల నియంత్రణలో అవకతవకలు, కస్టమర్లు, డిపాజిటర్లు, వాలెట్ హోల్డర్లను తీవ్రమైన నష్టాలకు గురి చేసింది. వేలాది కేసుల్లో ఓ కే పాన్ 100 కంటే ఎక్కువ కస్టమర్లకు , కొన్ని సందర్భాల్లో వెయ్యికంటే ఎక్కువ కస్టమర్లకు లింక్ చేయబడింది. రెగ్యులేటరీ బ్యాంక్ ఆర్బీఐ తేల్చింది. లావాదేవీల మొత్తం నిలిపివేయాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్స్ ని ఆదేశించింది. మార్చి 15 లోగా అన్ని లావాదేవీలు, నోడల్ ఖాతాలను సెటిల్ చేయాలని పేమెంట్స్ బ్యాంక్ ను ఆదేశించింది. 

RBI ఆదేశించిన రెండు వారాల్లో CLSA, మోర్గాన్ స్టాన్లీ , జెఫరీస్, బెనర్న్ స్టెయిన్ వంటి విదేశీ బ్రోకరేజీలు One 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) నుంచి తమ  టార్గెట్ ధరలను 20-60 శాతం తగ్గించాయి.