పేటీఎం బ్యాంక్‌‌‌‌‌‌‌‌ విషయంలో వెనక్కి తగ్గం: ఆర్​బీఐ

పేటీఎం బ్యాంక్‌‌‌‌‌‌‌‌ విషయంలో వెనక్కి తగ్గం: ఆర్​బీఐ

 న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌పై తీసుకున్న చర్యలను రివ్యూ చేయమని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ కంపెనీ కార్యకలాపాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్  తన బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను ఫిబ్రవరి 29 తర్వాత నుంచి ఆపేయాలని కిందటి నెల 31 న ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఆదేశాలు  జారీ చేసింది. ఈ చర్యలపై ఇప్పటిలో రివ్యూ ఉండదని, అలాంటి అంచనాలు పెట్టుకోవద్దని  శక్తికాంత దాస్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.  ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉంటామని, అదే టైమ్ లో  కస్టమర్ల రక్షణకు  కట్టుబడి ఉన్నామని అన్నారు. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇష్యూకి సంబంధించి   ప్రీక్వెంట్ ఆస్క్డ్‌‌‌‌‌‌‌‌ క్వశ్చన్స్ (ఎఫ్​ఏక్యూ) ను ఈ వారం  విడుదల చేస్తామన్నారు. రూల్స్ ఫాలో కాకపోవడంతోనే  రిస్ట్రిక్షన్లు పెట్టామని  దాస్ వెల్లడించారు. కాగా, ఈ బ్యాంక్‌‌‌‌‌‌‌‌పై గతంలోనూ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టింది. కొత్త కస్టమర్లను జాయిన్ చేసుకోకూడదని  2022 మార్చి 11న రిస్ట్రిక్షన్లు పెట్టింది. తాజాగా  డిపాజిట్లు తీసుకోవడాన్ని, అప్పులివ్వడం, టాప్ అప్స్ చేయడం వంటివి నిషేధించింది. కస్టమర్లకు క్యాష్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లు, రిఫండ్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వడాన్ని మాత్రం  బ్యాన్ చేయలేదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో  వన్‌‌‌‌‌‌‌‌97 కమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌ (పేటీఎం) కు 49 శాతం వాటా ఉంది.