జహీరాబాద్, వెలుగు: రాష్ట్ర కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఆదివారం జహీరాబాద్ లో దళిత సంఘాల నాయకులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంకటస్వామి గుల్బర్గా పర్యటనకు వెళ్తున్న క్రమంలో జహీరాబాద్ లోని ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్న గవర్నమెంట్ టీచర్ రామతీర్థం నరసింహులు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వచ్చి ఆయన కూతురు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రిని దళిత సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామతీర్థ నరసింహులు, దశరథ్, బి. నర్సయ్య, కె. బిచ్చయ్య, సంగమేశ్వర్, నర్సింలు, మాల మహానాడు నాయకులు ఆకాశ్, సమత సైనిక్ దళ్, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
