అభివృద్ధి పేరుతో కోట్లు దండుకున్నరు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

అభివృద్ధి పేరుతో కోట్లు దండుకున్నరు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చేర్యాల, వెలుగు: పదేళ్లలో చేర్యాలను విధ్వంసం చేసిన బీఆర్​ఎస్​ను వచ్చే మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్​ కేంద్రంలోని కొమ్మూరి క్యాంప్​ ఆఫీసులో జనగామ నియోజక వర్గ ఇన్​చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్​ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించి విధ్వంసం చేశారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో  కోట్లు దండుకున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఓట్లను ఎక్కువగా నమోదు చేసుకుని దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. 

మోసపూరితంగా వ్యవహరించే పల్లా రాజేశ్వర్ ​రెడ్డి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు బీఆర్​ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్​ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేర్యాలలో కాంగ్రెస్ గెలిచే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రెస్​మీట్​లో నాయకులు కొమ్మూరి ప్రశాంత్​రెడ్డి, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్​రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు కాటం సంజీవులు, మేర్గు శ్రీనివాస్, మేర్గు కృష్ణ, నర్సింగరావు, కళావతి, చంద్రయ్య, లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, ఆగంరెడ్డి పాల్గొన్నారు.