పేటీఎమ్ బ్యాంక్ సేవలు నిలిపివేత..!

పేటీఎమ్ బ్యాంక్ సేవలు నిలిపివేత..!

పేటీఎమ్ బ్యాంక్ సేవలు నిలిపివేస్తున్నట్లు సంస్థ తెలిపింది. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు తో చేసుకున్న అగ్రిమెంట్ ని రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మార్చ్ 16నుండి బ్యాంకింగ్ సేవలు నిలిపివేయాలంటూ ఆర్బీఐ నుండి పేటీఎమ్ కి ఆదేశాలు అందటంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుండి పేటీఎమ్ సంస్థ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ రాజీనామా చేశారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో నిపుణులైన వారితో కొత్త బోర్డు నియామకం జరిగింది.

పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిలిపేసిన పేటీఎమ్, కొత్త బ్యాంక్స్ తో అగ్రిమెంట్స్ చేసుకొని తమ బ్యాంకింగ్ సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలిపింది. పేటీఎమ్ అందిస్తున్న ఇతర సేవలు క్యూఆర్, సౌండ్ బాక్స్, పేటీఎమ్ యాప్, పేటీఎమ్ కార్డ్ మెషీన్స్ వంటి సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండబోదని, యదావిధిగా కొనసాగుతాయని తెలిపింది. పేటీఎమ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ సంస్థ షేర్ల మీద ప్రభావం చూపింది.

పేమెంట్స్ బ్యాంక్ సేవలు మాత్రమే నిలిచిపోతాయని, తమ సంస్థ అందిస్తున్న ఇతర సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇతర బ్యాంక్స్ తో ఒప్పందాలు ఒప్పందాలు చేసుకొని త్వరలోనే పేమెంట్స్ బ్యాంక్ సేవలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.