3 ఉమ్మడి జిల్లాల నేతలతో నేడు పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీక్ష

 3 ఉమ్మడి జిల్లాల నేతలతో నేడు పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీక్ష

హైదరాబాద్, వెలుగు: మూడు ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పీసీసీ కార్యవర్గంలో జిల్లాల వారీగా ఎవరికి చోటు కల్పించాలి.. లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంపై చర్చించనున్నారు.

శనివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు వరంగల్ జిల్లాలో పార్టీ పరిస్థితి, లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధత, ఆ జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులు ఆశించే సీనియర్ల జాబితా తదితర విషయాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ జిల్లాపై సమీక్ష, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లాపై రివ్యూ జరగనుంది.

ఈ సమీక్షలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. పీసీసీ కార్యవర్గంలో ఏ జిల్లా నుంచి ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి లీడర్ల పేర్లను తీసుకునే చాన్స్​ ఉందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.