పీసీబీ పోస్టుల్లో రిజర్వేషన్ ఉల్లంఘన.. బీసీ కమిషన్ చైర్మన్కు బీసీ నేతల ఫిర్యాదు

పీసీబీ పోస్టుల్లో రిజర్వేషన్ ఉల్లంఘన.. బీసీ కమిషన్ చైర్మన్కు బీసీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సహాయ శాస్త్రవేత్త (ఎనలిస్ట్ గ్రేడ్ -II) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని బీసీ నేతలు ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్​నిరంజన్​ను నేతలు కలిసి ఫిర్యాదు చేశారు.  దీనిపై స్పందించిన బీసీ కమిషన్ వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు.