ఆడింది చాలు.. ఇంటికి రండి: పాక్ క్రికెట్ బోర్డు అల్టిమేటం

ఆడింది చాలు.. ఇంటికి రండి: పాక్ క్రికెట్ బోర్డు అల్టిమేటం

ప్రాంచైజీ క్రికెట్ ఆడుకుంటాం అనుమతివ్వండి అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను అభ్యర్థించిన ఆ దేశ క్రికెటర్లకు ఎదురుదెబ్బ తగిలింది. వారి అభ్యర్థనను పికప్ చీఫ్ జాకా అష్రఫ్ తిరస్కరించారు. వెంటనే స్వదేశానికి రావాలని సూచించారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే..?

పాక్ క్రికెటర్లు హరీస్ రవూఫ్, ఉసామా మీర్‌లు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్నారు. వీరిద్దరికి పీసీబీ గతంలో ఐదు మ్యాచ్ లు ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇష్యూ చేసింది. ఆ గడువు నేటి(డిసెంబర్ 28)తో ముగియగా..  పొడిగింపు కోసం వీరి తరుపున మెల్‌బోర్న్ స్టార్స్.. పాక్ క్రికెట్ బోర్డు అభ్యర్థించగా తిరస్కరించింది. జనవరి 12 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎన్‌ఓసి గడువు ముగిశాక స్వదేశానికి వచ్చేయాలని సూచించింది. ఇదే లీగ్ లో సిడ్నీ థండర్‌కు ఆడుతున్న మరో పాక్ క్రికెటర్ జమాన్ ఖాన్‌కు ఈ విషయం తెలియజేసింది.

అనుమతిస్తే మరో మూడు మ్యాచ్‌లు

ఒకవేళ పీసీబీ వీరి అభ్యర్థనను అంగీకరించినట్లయితే మరో మూడు మ్యాచ్‌లు ఆడవచ్చు.  పీసీబీ తిరస్కరించినప్పటికీ ఆయా ఫ్రాంచైజీల్లో ఆశలు చావలేదు. వీరు మరో మూడు మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు అనుమతించే లక్ష్యంతో ఎన్‌ఓసి పొడిగింపు కోసం అభ్యర్థనను జనవరి 12 వరకు పొడిగించింది. 

కాగా, కొద్దిరోజుల క్రితం  హరీస్ రౌఫ్ టెస్ట్ క్రికెట్ ఆడనంటూ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే బోర్డ్ నుంచి అనుమతి తీసుకొని బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్నాడు.