ఫార్మా కంపెనీలకు పీసీబీ వార్నింగ్‌‌‌‌

ఫార్మా కంపెనీలకు పీసీబీ వార్నింగ్‌‌‌‌
  • యాదాద్రి జిల్లా అంతెమ్మగూడెం గ్రామస్తుల ఫిర్యాదుపై విచారణ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రామాల్లోకి ఇల్లీగల్‌‌‌‌గా కెమికల్‌‌‌‌, గ్యాస్‌‌‌‌ను వదిలితే ఆయా ఫార్మా కంపెనీలను పూర్తిగా మూసేస్తామని తెలంగాణ స్టేట్‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు (పీసీబీ) హెచ్చరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతెమ్మగూడెం గ్రామస్తుల ఫిర్యాదుపై శనివారం హైదరాబాద్‌‌‌‌లోని పీసీబీ ఆఫీస్‌‌‌‌లో విచారణ చేపట్టింది. తమ గ్రామంలోకి కొన్ని కంపెనీలు ఇల్లీగల్‌‌‌‌గా కెమికల్‌‌‌‌, గ్యాస్‌‌‌‌ను వదులుతున్నాయని గ్రామానికి చెందిన లింగస్వామి, నరేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, బండ కిష్టయ్య, మహేశ్‌‌‌‌ తదితరులు ఫొటోలతో సహా పీసీబీకి కంప్లైట్‌‌‌‌ చేశారు.

ఫార్మా కంపెనీలు ప్రతి రోజు సాయంత్రం, రాత్రి టైమ్‌‌‌‌లో కెమికల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌ను రిలీజ్‌‌‌‌ చేస్తున్నాయని తెలిపారు. దీంతో ప్రజలకు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని 10 ఫార్మా కంపెనీలను పీసీబీ ఆదేశించింది. తప్పును సరిదిద్దుకోకుంటే ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌‌‌‌ ఇచ్చింది. ఫార్మా కంపెనీలు ఇష్టమొచ్చినట్లు గ్యాస్‌‌‌‌, కెమికల్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ను వదులుతున్నా పీసీబీ చర్యలు తీసుకోవడం లేదని రైతుల తరఫున అడ్వొకేట్‌‌‌‌ వాదించారు. పరిశ్రమలను ఎప్పటికప్పుడు మానిటర్‌‌‌‌‌‌‌‌ చేయాలని, కాలుష్య స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఆ యూనిట్లను పూర్తిగా మూసేయాలని విజ్ఞప్తి చేశారు.