
- ఓట్ల దొంగతనంతోనే మోదీకి మూడోసారి అధికారం
- బీసీల కోసం బండి సంజయ్, ఈటల, అర్వింద్, లక్ష్మణ్ బయటకు రావాలె
- రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఇక బీఆర్ఎస్ ఉండదు
- చొప్పదండి నియోజకవర్గంలో రెండో విడత
- జనహిత పాదయాత్ర ప్రారంభం హాజరైన మంత్రులు
- వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోనూ ఓట్ల చోరీ జరిగిందని, 8 మంది బీజేపీ ఎంపీలు అట్లనే గెలిచారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ బయటపెట్టిన రుజువులు చూస్తుంటే అనుమానం వస్తున్నదని.. ఒక ఓటర్‌కు నాలుగు నియోజకవర్గాల్లో ఓటు ఉన్నదని, అందుకే కరీంనగర్‌లో బండి సంజయ్ గెలిచారని అన్నారు. ఓటు చోరీతోనే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర ఆదివారం సాయంత్రం చొప్పదండి నియోజకవర్గంలో ప్రారంభమైంది.
మొదటి రోజు గంగాధర మండలంలోని ఉప్పర మల్యాల నుంచి కురిక్యాల మీదుగా మధురానగర్ వరకు పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధురానగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉన్నాయని, ఎన్నికల కమిషన్ బీజేపీ వాళ్లకు అవసరమైన చోట ఓట్లు కలుపుతూ, అవసరం లేని చోట తీసేస్తున్నదని ఆరోపించారు.
‘‘ప్రజా మద్దతుతో మోదీ గెలవలేదు. మోదీకి ఒక్క క్షణం కూడా ప్రధానిగా ఉండే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోనూ బండి సంజయ్ దొంగ ఓట్లు వేయించుకుని ఎంపీ అయ్యారని ఆరోపించారు. ‘‘దేవుడి పేరు మీద ఓట్లడిగే బిచ్చగాళ్లు.. బీజేపీ వాళ్లు. వాళ్లు కులం, మతం, దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతారు. బీజేపీలో శ్రీరాముడికి సభ్యత్వం ఉన్నట్టు మాట్లాడుతారు. కానీ మేడం చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓట్లు అడుగుతాం. అది నాయకులకు ఉండాల్సిన లక్షణం. బీజేపీ వాళ్లకు ఎన్నికలప్పుడు దేవుళ్లు గుర్తొస్తారు. హిందూ, ముస్లిం గొడవలు గుర్తొస్తాయి’’ అని విమర్శించారు.
బండి సంజయ్‌కి బీసీలపై సోయి లేదు..బండి సంజయ్‌కి బీసీలపై సోయి లేదని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ‘‘మిస్టర్ బండి సంజయ్ దేశ్ ముఖ్.. నువ్వు బీసీవై ఉండి బీసీల గురించి ఒక్క మాటైనా మాట్లాడుతున్నావా? మా రేవంత్ రెడ్డి మొనగాడు.. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినం. బీసీల కోసం చట్టాలు తీసుకొస్తే మున్నూరు కాపు బిడ్డ అయిన బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డి, రామచందర్ రావు అడుగులకు మడుగులొత్తుతుండు.
బీసీల గురించి మాట్లాడని నువ్వేం లీడర్‌వు. సంజయ్ ని బీజేపీ అధ్యక్షుడిగా తీసేసిన రోజు బీసీ బిడ్డను ఎలా తీసేస్తారని నేను గళమెత్తిన. కానీ నీకు ఈ రోజు బీసీ సోయి లేదు’’ అని సంజయ్‌పై ఫైర్ అయ్యారు. ‘‘మీరు ముఖం చాటేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. నీకు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్‌కు చిత్తశుద్ధి ఉంటే.. మీ రక్తంలో బీసీ గుణం ఉంటే 42 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. రాష్ట్రపతి దగ్గర రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే ముఖం చాటేసి తిరగడం భావ్యమా?’’ అని ప్రశ్నించారు. బీసీలమంతా వాళ్ల వెనుక ఉన్నామని.. బండి సంజయ్, ఈటల, అర్వింద్, లక్ష్మణ్ బయటకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు..
రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదని, ఇప్పటికే ఆ పార్టీ మూడు ముక్కలైందని మహేశ్ గౌడ్ ఎద్దేవా చేశారు. ‘‘ఒక ముక్క.. సుక్క బిజినెస్ చేసి జైలుకు పోయి ఇవాళ విదేశాలకు పోయింది. ఇంకో ముక్క.. అవినీతి కేసులో ఎప్పుడు జైలుకుపోతానా? అని చూస్తున్నది. ఈ రెండు ముక్కల కొట్లాటలో పెద్ద ముక్క ఫామ్ హౌస్ కే పరిమితమైంది. అవకాశం కోసం నాలుగో ముక్క ఎదురుచూస్తోంది’’ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేసి జేబు నింపుకున్నారని, ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ 100 సీట్లు తగ్గకుండా గెలిచి అధికారంలోకి వస్తుందని, బిహార్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకే రాహుల్ యాత్ర: మీనాక్షి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్‌గాంధీ బిహార్‌లో పాదయాత్ర చేపట్టారని మీనాక్షి నటరాజన్ తెలిపారు. ‘‘రాహుల్ ఇంట్లో ముగ్గురు ప్రధానులుగా పని చేశారు. ఆయన తలచుకుంటే హెలీకాప్టర్ లో తిరగగలరు. అయినా ఆయన సామాన్యుడిలా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నారు. గతంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత న్యాయ యాత్ర చేశారు. మామూలుగా దేశంలో రెండు రకాల రాజనీతి అమలులో ఉంటుంది. మొదటిది ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, వారిని అణగదొక్కేది. రెండోది అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని, బలహీనుల అభివృద్ధిని కాంక్షించేది. కాంగ్రెస్‌ది రెండో విధానం” అని అన్నారు.
‘‘నీ ఉద్యోగం పోతే, నేనేం చేయాలి? మహిళా ప్యాసింజర్లు నిద్రపోతుంటే వచ్చి అసభ్యకరంగా టచ్ చేస్తారా? ప్రజలను కాపాడే తరీకా ఇదేనా? మహిళలతో మిస్ బిహేవ్ చేయడానికే మీకు యూనిఫాం ఇచ్చారా?” అని బాధితురాలు ప్రశ్నించింది. దీంతో కానిస్టేబుల్ ఆమెకు క్షమాపణ చెప్పాడు. ఆమె తీసిన వీడియో వైరల్ గా మారింది. నిందితుడిని అధికారులు సస్పెండ్ చేశారు.