- ఈ నెల 28న ఊరూరా నిరసనలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ క్యాడర్ కు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పిలుపునిచ్చారు.
ఏఐసీసీ పిలుపు మేరకు ఇప్పటికే హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో పీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు, పేదలకు బీజేపీ సర్కారు కుట్రలను, ప్రధాని నరేంద్ర మోదీ మోసాన్ని తెలియజేసేందుకే పల్లెల్లో నిరసనలకు పిలుపినిచ్చామని చెప్పారు.
