
- 2018లో ఓటమికి వాళ్ల ఫోన్ ట్యాపింగే కారణం
- బీఆర్ఎస్ సర్కారు మా ప్రైవెసీని హరించింది
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: గత ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేసే 2018లో అధికారంలోకి వచ్చిందని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఫోన్ తో పాటు 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా హ్యక్ చేశారని, రైట్ టు ప్రైవెసీ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానినీ కాలరాశారని ఫైర్ అయ్యారు.
చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లు టాప్ చేశారని అన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయన్నారు.
అనిల్ కుమార్ యాదవ్, అనిల్ తోపాటు అనేకమంది ఫోన్లు టాప్ అయినట్లు తెలుస్తోందని చెప్పారు. వాళ్లు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థమవుతోందన్నారు. రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.