ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ:  పీసీసీ చీఫ్ మహేశ్

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ:  పీసీసీ చీఫ్ మహేశ్
  • గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేశ్ వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ లక్ష్యమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం లేకపోతే దేశానికి స్వాతంత్ర్యమే లేదన్నారు.

కేంద్రంలో అధికారమే పరమావధిగా.. కుర్చీ కోసం విచ్చిన్నకరమైన పాలన చేస్తున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు. పెద్దల కోసం పేదల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు ఇక ఎంత మాత్రం క్షమించరని హెచ్చరించారు. బిహార్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని, ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ నిరూపించారని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.