
- ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నది
- ప్రభుత్వ ఫలాలు సమానంగా అందినప్పుడే సామాజిక న్యాయం
- ఢిల్లీలో కులగణనపై పీసీసీ చీఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
న్యూఢిల్లీ, వెలుగు: దేశానికి తెలంగాణ కులగణన ఆదర్శంగా నిలిచిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తా మని కేంద్రం ప్రకటించడం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విజయమని తెలిపా రు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో మహేశ్ గౌడ్ అధ్యక్షతన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘జనాభా ప్రాతిపది కన ఎవరి వాటా వారికి అందాలన్నదే రాహుల్ ఆలో చన. ప్రభుత్వ ఫలాలు సమానంగా అందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాహుల్ నమ్ముతారు.
ఆయన ఆలోచన విధానం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వర్గం ప్రత్యేక శ్రద్ధతో అన్ని రకాల అంశాలను పరిగణన లోకి తీసుకొని కులగణన పూర్తి చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకున్నది. దేశం మొత్తం బీసీ రిజర్వేషన్లు అమ లు చేసేందుకు ఇది అంకురార్పణ’’అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నో ఏండ్ల బీసీల కలను అందరూ సహకరించి అమలయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలి
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకుం టే.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వం లో ఉద్యమం చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హెచ్చరించారు. ఈ బిల్లుపై బీజేపీ లీడర్లు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఓటేసి.. కేంద్రం వద్దకు ఫైల్ చేరుకునేసరికి సైడ్ అయిపోయారన్నారు. ఢిల్లీలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో మహేశ్ గౌడ్ సమావేశం అయ్యారు.