కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆరే దోషి: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆరే దోషి:  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
  • ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కమీషన్ల కోసం రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిండు: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​
  • రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల దిబ్బగా మారిస్తే  రేవంత్ సర్కారు చక్కదిద్దుతున్నది
  • అధికారం పోయిందని కేసీఆర్‌‌‌‌కు నిద్రపడ్తలే
  • కేటీఆర్​ పిచ్చోడై తిరుగుతుంటే..
  • హరీశ్‌‌రావు అబద్ధాలు భుజానేసుకుండు
  •  సంగారెడ్డి, ఆర్మూర్‌‌‌‌లో  జనహిత పాదయాత్ర

సంగారెడ్డి/నిజామాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ సీఎం కేసీఆరే దోషి అని  కమీషన్‌‌ విచారణలో తేలిందని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ తెలిపారు. రూ.45 వేల కోట్ల అంచనా గల ప్రాజెక్ట్‌‌ను  కమీషన్ల కోసం కేసీఆర్​ రూ.1.25 లక్షల కోట్లకు పెంచి ప్రజా ధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ఇంజినీర్లు చెప్పింది వినకుండా ఇష్టానుసారంగా  ప్రాజెక్టు కట్టడంతో ప్రజాధనం మట్టిపాలైందని అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో రెండోరోజు జనహిత పాదయాత్ర కొనసాగింది. నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ సెగ్మెంట్‌‌కు జనహిత పాదయాత్ర చేరుకున్నది. ఈ రెండు చోట్ల మహేశ్‌‌గౌడ్ మాట్లాడారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారికి శిక్ష పడడం ఖాయమని, కేసీఆర్‌‌ బోనులో నిలబడే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పులకు.. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం నెలకు రూ. 6 వేల కోట్లు చెల్లిస్తున్నదని తెలిపారు. మరో రూ.6 వేల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు పోగా.. మిగిలిన రూ.6 వేల కోట్లతో ప్రభుత్వాన్ని నడపడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.  కేసీఆర్ చేతకానితనం వల్లే బనకచర్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చిందని, దానిని ఆపేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.  

బనకచర్ల పాపం కేసీఆర్‌‌‌‌దే

అబద్ధాలతో రాజకీయాలు చేసి ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌‌‌‌కు అధికారం పోవడంతో నిద్రపట్టడంలేదని మహేశ్‌‌కుమార్​గౌడ్​ అన్నారు. ‘‘కేటీఆర్​ పిచ్చోడై రోడ్లమీద తిరుగుతుంటే.. హరీశ్‌‌రావు అబద్ధాలు భూజాన మోస్తూ కాంగ్రెస్​ సర్కారును బద్నాం చేస్తున్నాడు. వీరంతా కలిసి అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.  2016లో జరిగిన అపెక్స్​ మీటింగ్‌‌లో పాల్గొన్న కేసీఆర్..​ తెలంగాణ హక్కులను కాలరాయడం వల్లే బనకచర్ల తెరపైకి వచ్చిందని, ముమ్మాటికీ ఆ పాపం కేసీఆర్‌‌‌‌దేనని మండిపడ్డారు.   కాంగ్రెస్​ గవర్నమెంట్​ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే.. ఎమ్మెల్సీ కవిత రంగులు పూసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.  దేవుడి పేరుతో బీజేపీ పాలిటిక్స్​ చేస్తున్నదని మండిపడ్డారు.  ప్రధాని మోదీ, అమిత్​షా ఏ రోజు మనస్ఫూర్తిగా దేవుడికి పూజలు చేయరని, పాపాలు మాత్రం చేస్తారని అన్నారు.  సీఎం రేవంత్​రెడ్డి, తాను  అన్నదమ్ములకంటే ఎక్కువని తెలిపారు.  

విడదీత బీజేపీ విధానం: మీనాక్షి నటరాజన్​

ప్రజలను కలపడం కాంగ్రెస్ విధానం అయితే.. విడదీయడం బీజేపీ సిద్ధాంతం అని  కాంగ్రెస్​ స్టేట్​ వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్​ అన్నారు. మహాత్మాగాంధీ, వినోబా భావే చూపిన దారిలో రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​జోడో యాత్ర మనుషుల మధ్య ప్రేమను పంచిందన్నారు. బిహార్​ రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల కోసం 65 లక్షల ఓటర్లను జాబితానుంచి తొలగించనున్నారని తెలిపారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని, పౌరుల హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. దేశంలో సామాజిక న్యాయం నిలబెట్టాలనే సంకల్పంతో సీఎం రేవంత్​రెడ్డి పనిచేస్తున్నారని, బీసీ రిజర్వేషన్​ చట్టబద్ధతకు 5న ఢిల్లీ దర్బార్‌‌‌‌ను కదలించబోతు న్నామన్నారు. పంచాయతీరాజ్​ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడారు. ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్​, శంకర్​నాయక్​, ఎమ్మెల్యే 
మదన్​మోహన్​రావు, మాజీ ఎంపీ మధుగౌడ్​, ఏనుగు రవీందర్​రెడ్డి, ఆకుల లలిత, వినయ్​రెడ్డి, ముత్యాల సునీల్​రెడ్డి పాల్గొన్నారు. 

స్టూడెంట్లను కలిసిన మీనాక్షి నటరాజన్‌‌

జనహిత పాదయాత్ర సందర్భంగా సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్‌‌ను  ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌ కలిశారు. ఉదయం పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌తో కలిసి కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం స్టూడెంట్స్‌‌తో ముచ్చటించారు. సోలార్, ఎలక్ట్రిక్‌‌ ఎనర్జీ మాదిరిగానే మనిషి కూడా శారీరకంగా ఎనర్జీతో ఉండాలన్నారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.   మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేశ్‌‌ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్‌‌ పాల్గొన్నారు.