
- సీఈసీ నోటిఫికేషన్ చట్ట విరుద్ధం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. బంగారు కూలీ కేసు... కోర్టులో విచారణలో ఉండగా.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా ఎలా మారుస్తారని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని రేవంత్ ట్వీట్ చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందన్నారు.