
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బూత్ లెవల్లో డిజిటల్ సభ్యత్వం చేపడతామని అన్నారు. దీని కోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్ లో మాట్లాడిన రేవంత్..సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందుతుందన్నారు. ప్రమాదంలో ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని చెప్పారు.
పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డు ఇస్తున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. చాలా పారదర్శకంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు నిర్విహిస్తున్నామని..దాదాపు 30 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించేందుకే బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..