
హైదరాబాద్: బ్యాంకుల ఆగడాలకు రైతులు చనిపోతుంటే కనిపించడం లేదా అంటూ సీఎం కేసీఆర్ ను వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే రైతులు కనపడటం లేదా అని క్వశ్చన్ చేశారు. రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకునే అన్నదాతలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ‘బ్యాంకు ముందే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య’ అనే శీర్షికతో వీ6 వెలుగు దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ ను షర్మిల జత చేశారు. ఇంట గెలిచాక రచ్చ గెలవాలన్నారు. ముందు ఇక్కడి రైతుల చావులను ఆపి, తర్వాత దేశాన్ని ఏలాలని వ్యాఖ్యానించారు. తమిళనాడు, కేరళ సీఎంతో మంతనాలకు, బీజేపీ ప్రతిపక్ష నేతలతో దోస్తానా చేయడానికి కేసీఆర్ కు సమయం ఉంటుందన్నారు. కానీ రాష్ట్రంలో చనిపోతున్న రైతన్నలను ఆదుకోవాలనే సోయి మాత్రం ఆయనకు లేదన్నారు.
ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా.
— YS Sharmila (@realyssharmila) January 12, 2022
మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో
మాటామంతికి, కేరళ CM తో మంతనాలు చేయడానికి,
బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి,
దేశ రాజకీయాల మీద చర్చ చేయడానికి సమయం ఉంది తప్ప
చనిపోతున్న రైతులను ఆదుకోవాలనే సోయి లేదు.
మీ రైతుబంధు వారోత్సవాల సాక్షిగా 1/2 pic.twitter.com/3DcKPpaCjZ
మరిన్ని వార్తల కోసం: