ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారినయ్

ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారినయ్

హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించిందన్నారు. తక్షణమే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ ఘటనలు చూస్తే అర్థమవుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాఠశాలల్లో కనీస వసతులు కల్పించలేకపోతున్నారని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్  జరిగింది. రాత్రి భోజనం చేసిన తర్వాత 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని మొదట వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. అయితే పలువురు విద్యార్థులకు సీరియస్ గా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.