మేడారం నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర

మేడారం నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం ములుగు జిల్లాలోని మేడారం నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర మొదలుపెట్టనున్నారు. మొదటి రోజు యాత్రకు సంబంధించిన షెడ్యూల్​ను పీసీసీ ఆదివారం రిలీజ్​ చేసింది. ఉదయం 8 గంటలకు హైదరాబాద్​ నుంచి ములుగు బయల్దేరివెళ్లనున్న రేవంత్​.. ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఆ గుడి నుంచే యాత్రను షురూ చేస్తారు. కొత్తూరు, నార్లాపూర్, ప్రాజెక్ట్​నగర్ దాకా నడవనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రాజెక్ట్​ నగర్​లో భోజనం చేసి.. 2.30 గంటల నుంచి మళ్లీ నడక ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పస్రా గ్రామంలో టీ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి  6 గంటల దాకా పస్రా జంక్షన్​లో కార్నర్​మీటిం గ్ నిర్వహిస్తారు. మళ్లీ పాదయాత్ర మొదలుపెట్టి రాత్రి 8 గంటలకు రామప్పకు చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. మరోవైపు యాత్రకు ఏర్పాట్లు చేసేందుకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, బలరాం నాయక్​, రాజయ్య, విజయరమణ రావు తదితరులు ఆదివారమే ములుగు చేరుకున్నారు.