సీఎం కేసీఆర్‌పై లోక్‌పాల్‌లో ఫిర్యాదు

సీఎం కేసీఆర్‌పై లోక్‌పాల్‌లో ఫిర్యాదు

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నాడని పిసిసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్, అడ్వకేట్ కె. శ్రవణ్ కుమార్ లు బుధవారం లోక్ పాల్ లో ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్.. ఖరీదైన ప్రభుత్వ స్థలాలను జివో నెం.59 ద్వారా తక్కువ ధరకు కట్టబెడుతూ, అధికార పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని వారు ఫిర్యాదులో తెలిపారు.

కేసీఆర్ తాయిలాలకు TRS పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే  పువ్వాడ అజయ్ కుమార్, మహాకూటమి తరుపున గెలిచిన సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి లొంగిపోయారన్నారు. ఈ ముగ్గురితోపాటు సిఎల్పిని టిఆర్ఎస్ ఎల్పీ లోకి విలీనానికి సంతకం పెట్టిన మొత్తం 11మంది ఎమ్మెల్యే లపై ఆధారాలతో సహా లోక్ పాల్ లో ఫిర్యాదు చేశారు మానవతా రాయ్, శ్రవణ్ కుమార్. బుధవారం సాయంత్రం 4:30 కి డిల్లీ అశోకా హోటల్ లోని లోక్ పాల్ కార్యాలయంలో ఛైర్మన్ కి పిర్యాదు చేశారు.