ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లురవి అరెస్ట్ ను ఖండించిన ఉత్త‌మ్

ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లురవి అరెస్ట్ ను ఖండించిన ఉత్త‌మ్

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న మాల్కాజ్‌‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లురవి ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్గమధ్యలోనే అడ్డుకుని, ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ను పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. దీంతో కొంతసేపు రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. తమ నేతల అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అరెస్ట్ పై స్పందిస్తూ… రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమని అన్నారు. ప్రజాప్రతినిధులుగా శ్రీశైలం సంఘటనను పరిశీలించడం, బాధితులను పరామర్శించడం కనీస బాధ్యత అని గుర్తుచేశారు.

త‌మ తప్పిదాలు బయట పడతాయని తెలంగాణ‌ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నాయ‌కుల‌ నిర్బంధానికి పాల్పడుతోందన్నారు. రేవంత్, మల్లు రవిలను వెంటనే విడుదల చేసి శ్రీశైలం సంఘటన స్థలాన్ని సందర్శించే అనుమతి ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.