
సెకండ్ వేవ్ కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మోడీ, కేసీఆర్ చేతగానితనంతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ కిట్లు లేకపోవడం దారుణమన్న ఆయన... రాష్ట్ర ప్రజలకు RT-PCR టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా ట్రీట్‌మెంట్‌కు పేద ప్రజలు సర్వం అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. ఏపీ, తమిళనాడులో కోవిడ్‌కు ఉచిత ట్రీట్‌మెంట్ చేస్తున్నారన్న ఉత్తమ్.. రేపటి నుంచి రాష్ట్రంలో కూడా ఫ్రీ ట్రీట్‌మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.