
- July 10న నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: సోమవారం జరగాల్సిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం10వ తేదీకి వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీపై ఫిర్యాదు చేసిన ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని చైర్మన్ మల్లు రవి ఆదేశించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ వివాదం ఈ సమావేశంతో ఓ కొలిక్కి రానుందని అంతా భావించారు. అయితే, ఇదే రోజున వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం ఉన్నందున అక్కడి ఎమ్మెల్యేలు దీనికి హాజరుకావాల్సి ఉంది.
అందుకే సోమవారం జరగనున్న క్రమ శిక్షణ కమిటీ మీటింగ్కు తాము హాజరుకాలేకపోతున్నామని అక్కడి ఎమ్మెల్యేలు మల్లు రవికి సమాచారం అందించారు. దీంతో వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న చైర్మన్ మల్లు రవి ఈ సమావేశాన్ని10 కి వాయిదా వేశారు.