మోదీ కుట్రతోనే మీనాక్షి నామినేషన్ తిరస్కరణ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

మోదీ కుట్రతోనే మీనాక్షి నామినేషన్ తిరస్కరణ : పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ కుట్రతోనే కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్​ను ఎన్నికల సంఘం తిరస్కరించిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. గాంధేయవాది, సాదాసీదా మహిళను రాజ్యసభలోకి రాకుండా మోదీ అడ్డుకున్నారని ఆరోపించారు.

ఇలాంటి నేతలు మహిళల రాజకీయ సాధికారత గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని ఎద్దేవా  చేశారు. దేశంలోని అన్ని  రాజ్యాంగ వ్యవస్థలను మోదీ తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు