అన్ని రంగాల్లో బీఆర్ఎస్ సర్కార్​ ఫెయిల్ : కుసుమ కుమార్

అన్ని రంగాల్లో బీఆర్ఎస్ సర్కార్​ ఫెయిల్ :  కుసుమ కుమార్

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ అన్ని రంగాల్లోనూ ఫెయిలైందని​ పీసీసీ మీడియా కమిటీ చైర్మన్​ కుసుమ కుమార్​ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు అబద్ధాలాడుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏఐసీసీ అధికార ప్రతినిధి డోలి శర్మ, ఏఐసీసీ మీడియా అబ్జర్వర్లు గౌతమ్​ సేథ్​, అలీ మహాదీలతో కలిసి గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు.

మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలకు ప్రమాణ పత్రం లాంటిదన్నారు. కానీ, కేసీఆర్ ​ప్రజలకు హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేశారని ఫైర్ అయ్యారు. వరాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని డోలి శర్మ ఆరోపించారు. అత్యాచారాల్లో తెలంగాణ నంబర్​ వన్​ అని పేర్కొన్నారు. మహిళలకు కనీసం వెల్ఫేర్​ బోర్డు కూడా  లేదని తెలిపారు. లిక్కర్​ సేల్స్​ దేశంలోకెల్లా తెలంగాణలోనే ఎక్కువన్నారు.

నియామకాలు చేపట్టకుండా యువతను మోసం చేసిందని గౌతమ్​ సేథ్​ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని అలీ మహాదీ ఆరోపించారు. అవినీతిలో తెలంగాణ ఫస్ట్​ ప్లేస్​లో ఉందన్నారు. కేసీఆర్​ కూతురు కవిత లిక్కర్​ స్కామ్​కు పాల్పడినట్టు తేలిందని అలీ మహాది పేర్కొన్నారు.