బీజేపీ అంగడి పేరేంటో చెప్పాలి.. బండి సంజయ్‌‌ను ప్రశ్నించిన జి.నిరంజన్ 

బీజేపీ అంగడి పేరేంటో చెప్పాలి.. బండి సంజయ్‌‌ను ప్రశ్నించిన జి.నిరంజన్ 

బీజేపీ అంగడి పేరేంటో చెప్పాలి

సంజయ్‌‌ను ప్రశ్నించిన కాంగ్రెస్‌‌ నేత జి.నిరంజన్ 

హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరం జన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని దుకాణమంటూ విమర్శిస్తున్నారని, మరి, బీజేపీ అంగడి పేరేంటో చెప్పాలని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవ న్‌‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కిరాణా దుకాణం నుంచి బీజేపీలో చేర్చుకున్న వారిని ఏమిచ్చి కొన్నారో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో, ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్‌‌తో తేలిపోయిందని విమర్శించారు. కుటుంబ రాజకీయాలు వద్దనుకునే వాళ్లు బీజేపీకి ఓటేయాలని మోదీ అంటున్నారని, పెళ్లి చేసుకొని భార్య భర్తలను వదిలేయాలనుకు నేటోళ్లు బీజేపీకి ఓటేయాలంటూ తాము కూడా పిలుపునిస్తామని చెప్పారు.