ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు రద్దు చేయొద్దు

ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సు రద్దు చేయొద్దు
  • పీడీఎస్​యూ డిమాండ్ 

ఓయూ,వెలుగు: ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్స్ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వర్సిటీల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని పీడీఎస్​యూ నేతలు డిమాండ్​ చేశారు. బుధవారం  ఓయూ ఆర్ట్స్​ కాలేజీ వద్ద సంఘం నాగేశ్వర్​రావు, రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు.  ఓయూ పరిధిలోని నిజాం కాలేజీలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్స్ రద్దు చేస్తూ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం స్టూడెంట్లకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. 

వర్సిటీలను పటిష్ట పరచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఓయూ స్టూడెంట్స్ అజెండాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వర్సిటీల్లోని స్టూడెంట్లు, స్కాలర్స్​కు తగిన విద్యా ప్రోత్సాహకాలు అందించాలని, అన్నిరకాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.