వీ6 ఛానెల్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో

వీ6 ఛానెల్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో

వీ6 వెలుగు, వీ6 ఛానెల్ పై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 2023, మార్చి 10వ తేదీన మహబూబాబాద్ జిల్లా వివేకానంద సెంటర్ లో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వీ6 యాజమాన్యానికి వెంటనే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందోళన చేస్తామని PDSU రాష్ట్ర నాయకులు హెచ్చరించారు.

2023, మార్చి 9వ తేదీన.. వీ6 న్యూస్ చానెల్, వెలుగు పత్రికపై అక్కసు వెళ్లగక్కారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందిస్తూ.. ప్రత్యేకంగా వీ6, వెలుగు పత్రికలపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మద్య నిషేధం ఉన్న గుజరాత్ లో లిక్కర్ తాగి 42 మంది చనిపోతే.. దాన్ని స్కాం అంటామా.. స్కీమ్ అంటామా.. మీ వీ6లో చూపించారా? అంటూ చానెల్ ప్రతినిధిని ప్రశ్నించారు. వీ6లో ఏం చూపిస్తారో తెలుసు.. ఏం మాట్లాడతారో తెలుసు.. ఏం డ్రామాలు చేస్తారో మాకు తెలుసు.. ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. బీజేపీకి మౌత్ పీస్ లా ఉన్న చిల్లర చానెల్స్ అంటూ కొన్ని ఛానెల్స్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆ చానెల్స్ ను ప్రజల ముందు ఎండగడతాం అంటూనే.. వీ6 న్యూస్ చానెల్, వెలుగు పత్రికను కేటీఆర్ ప్రస్తావించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.