రేపు ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 3 వ‌ర‌కు భార‌త్ బంద్

రేపు ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 3 వ‌ర‌కు భార‌త్ బంద్

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు సంఘాలు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ ను మంగ‌ళ‌వారం ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియ‌న్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. తమ బంద్ ద్వారా సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు

బంద్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని, తమ తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని, ఆ తర్వాత 3 గంటలకు బంద్‌ను ముగిస్తామని, ఆ సమయంలో కార్యాలయాలు కూడా ముగుస్తాయని‌ రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. అత్యవసర సర్వీసులైన అంబులెన్స్‌లు, పెళ్లిళ్లు యథావిథిగానే జరుగుతాయని అన్నారు. తమ నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తామని, తమ నిరసన వ్యక్తం చేయడానికి దీనిని ఓ పద్ధతిగా మాత్రమే ఎంచుకున్నట్లు రాకేష్ స్పష్టం చేశారు.