బెంగళూరు సిటీలో అర్కిటెక్ నుంచి వడప్పావు సెల్లర్గా..

బెంగళూరు సిటీలో అర్కిటెక్ నుంచి వడప్పావు సెల్లర్గా..

బెంగళూరు నగరం గురించి మనకు తెలియంది కాదు.. ఎప్పుడు బిజీబిజీగా ఉండే నగరాల్లో మొదటిది. సంపాదించాలంటే ఈనగరం బెస్ట్ అంటుంటారు టెక్, ఇతర ఉద్యోగులు.ఉద్యోగమే కాదు ఇక్కడా ఏ చిన్న వ్యాపారం పెట్టుకున్నా.. దండిగానే సంపాదించొచ్చన్ని చాలా మంది బెంగలూరు స్ట్రీట్ వెండర్లు రుజువు చేశారు. టీ స్టాల్ నుంచి పాప్ కార్న్ సెంటర్స్,  జ్యూస్ పాయింట్లు,  చిన్న చిన్న చిరుతిళ్లు అమ్మే వ్యాపారం బాగానే సాగుతుందని.. ఇందులో కూడా బాగానే సంపాదిస్తున్నామని చెబుతున్నారు అక్కడి వీధి వ్యాపారులు.. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ రంగాల్లో రాణిస్తుండటం. అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం.. బెంగుళూరు నగరంలో ఏదో ఒక ప్రత్యేకత తో వీధి వ్యాపారులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.. ఇలాంటి కోవకు చెందిన ఓ బెంగళూరు వీధి వ్యాపారికి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.. అదేంటో చూద్దాం.. 

బెంగుళూరు చెందిన స్ట్రీట్ వెండర్ వికాస్ ఇటీవల xలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. ఇందులో ఏముందంటే.. తాను హీరోని కాదని.. కానీ నేను ఒక వడ పావ్ తో రోజును ఆదా చేయగలుగుతున్నాను అని రాసి వున్న ప్లకార్డుతో ఓ ఫొటోను షేర్ చేశాడు. ‘ నేను  Zudio, HSR  లో వ్యక్తిని కలిశాను. అతని దగ్గర  వడపావ్ తిన్నాను.. చాలా బాగా అనిపించింది. ఇతను ఓ ఆర్కిటెక్ట్.. కార్పొరేట్ ప్రపంచాన్ని విడిచిపెట్టి వడపావ్ అమ్ముతున్నాడు. బెంగళూరు లో నివసించడం అంటే ఇన్నోవేషన్ రోలర్ కోస్టర్ లో థ్రిల్లింగ్ రైడ్ అంటూ రాశాడు. 

మిస్టర్ వికాస్ చెప్పదలిచిన విషయం ఏమిటంటే..బెంగళూరు నగరంలో సంపాదించడం అనేది ఒక్క టెక్ ఉద్యోగంతో నే కాదు.. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ కూడా బాగానే సంపాదిస్తున్నారు అని.. స్టార్టప్ ల నగరం బెంగళూరు లో నివసించడం అంటే మామూలు విషయం కాదు..దీంతోపాటు ఉపాధి కూడా ఉంటుంది. అది చిరు వ్యాపారంలో అయినా అని.