జూబ్లీహిల్స్, వెలుగు : పెద్దమ్మ తల్లి ఆలయ 30వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఆలయ నిర్వాహకులు రథోత్సవాన్ని నిర్వహించారు. మాఘ మాసంలో వచ్చే రథ సప్తమిరోజు అమ్మవారి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
