పార్ట్ టైమ్​ జాబ్​ పేరుతో రూ.16 లక్షలు కొట్టేసిండ్రు

పార్ట్ టైమ్​ జాబ్​ పేరుతో రూ.16 లక్షలు కొట్టేసిండ్రు

జ్యోతినగర్, వెలుగు: ఆన్​లైన్ ​పార్ట్​టైమ్ జాబ్ పేరుతో సైబర్​నేరగాళ్లు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకుడి నుంచి దాదాపు రూ.16 లక్షలు కొట్టేశారు. ఎస్సై జీవన్ తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్ కు చెందిన ఎం.అవినాశ్​ఆన్​లైన్​పార్ట్​టైమ్​జాబ్​కోసం టెలిగ్రామ్​యాప్ లో సెర్చ్ చేస్తుండగా ఓ లింక్​వచ్చింది. అందులో తన వివరాలు నమోదు చేశాడు.

తర్వాత ఆన్​లైన్​లో ఇచ్చిన టాస్క్ కంప్లీట్​చేస్తే కమీషన్ వస్తుందని మెసేజ్​రావడంతో నమ్మాడు. అలా సైబర్​నేరగాళ్లు అడిన అకౌంట్​కు రూ.15లక్షల80 వేలు ట్రాన్స్​ఫర్​చేశాడు. రోజులు గడుస్తున్నా.. తనకు కమీషన్​రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని, మంగళవారం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.